యాదాద్రిలో ఇద్దరు వంట స్వాముల సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-08-16T09:53:15+05:30 IST

గుట్ట నారసింహుడి పుణ్యక్షేత్రంలోని బ్రాహ్మణ సత్రంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వంట స్వాములను..

యాదాద్రిలో ఇద్దరు వంట స్వాముల సస్పెన్షన్‌

యాదాద్రి టౌన్‌, ఆగస్టు 15:  గుట్ట నారసింహుడి పుణ్యక్షేత్రంలోని బ్రాహ్మణ సత్రంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వంట స్వాములను ఈవో గీతారెడ్డి శనివారం సస్పెండ్‌ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేవస్థాన అధికారుల కోసం వండిన ఉప్మా రుచిగా లేదని వేటు వేసినట్లు తెలిసింది. ఉప్మా, సిరా, దద్దోజనం వంటకాలను సిద్ధం చేసేందుకు గోదాము నుంచి సరిపడా సరుకులు తీసుకున్నా.. నాణ్యతగా తయారు చేయకపోవడంపై చర్యలు తీసుకున్నట్లు సస్పెన్షన్‌ లెటర్‌లో ఈవో పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-16T09:53:15+05:30 IST