లక్ష్మీనరసింహుడికి పట్టు వస్ర్తాలను బహుకరించిన మంత్రి అల్లోల

ABN , First Publish Date - 2020-03-04T22:49:06+05:30 IST

యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

లక్ష్మీనరసింహుడికి పట్టు వస్ర్తాలను బహుకరించిన మంత్రి అల్లోల

యాదాద్రి: యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలను సమర్పించారు. ఆలయానికి వచ్చిన మంత్రి అల్లోల దంపతులకు ఆలయ ఈవో , ఇతర అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం మంత్రి ఆల్లోల దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, కలెక్టర్‌అనితారామచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-04T22:49:06+05:30 IST