యాదాద్రి: లక్ష్మీ నృసింహ రిజర్వాయర్ పనులకై పంట పొలాల ధ్వంసం

ABN , First Publish Date - 2020-09-03T15:48:51+05:30 IST

భువనగిరి మండలం బస్వాపూర్ వద్ద చేపట్టే లక్ష్మీ నృసింహ రిజర్వాయర్ పనులకు అడ్డంకిగా ఉన్నాయాని పంట పొలాలను ప్రాజెక్ట్ సిబ్బంది ధ్వంసం చేశారు.

యాదాద్రి: లక్ష్మీ నృసింహ రిజర్వాయర్ పనులకై పంట పొలాల ధ్వంసం

యాదాద్రి-భువనగిరి: భువనగిరి మండలం బస్వాపూర్ వద్ద చేపట్టే లక్ష్మీ నృసింహ రిజర్వాయర్ పనులకు అడ్డంకిగా ఉన్నాయాని పంట పొలాలను ప్రాజెక్ట్ సిబ్బంది ధ్వంసం చేశారు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నోటికాడికి వచ్చిన పంటలకు నష్టం చేశారని రైతులు వాపోయారు. అయితే పొలాలకు ఇప్పటికే పరిహారం చెల్లించామని, పంటలు సాగు చేయొద్దని ముందస్తు సమాచారం ఇచ్చామని ప్రాజెక్ట్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. 

Updated Date - 2020-09-03T15:48:51+05:30 IST