ఉత్తమ్ వ్యాజ్యంలో అవాస్తవాలు!
ABN , First Publish Date - 2020-06-23T10:07:57+05:30 IST
తమ పార్టీ నేతలను గృహ నిర్బంధం, అరెస్టు చేసి ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను హరిస్తోందంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలోని అంశా లు సత్యదూరంగా ఉన్నాయని అదనపు డీజీపీ రాజీవ్‌రతన్ హైకోర్టుకు

హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ నేతలను గృహ నిర్బంధం, అరెస్టు చేసి ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను హరిస్తోందంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలోని అంశా లు సత్యదూరంగా ఉన్నాయని అదనపు డీజీపీ రాజీవ్‌రతన్ హైకోర్టుకు తెలిపారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వం తరఫున ఆయన కౌంటర్ దాఖలు చేశారు. వ్యక్తిగత కార్యకలాపాలకు ఎక్కడా అడ్డుచెప్పడం లేదన్నారు. కానీ, రాజకీయ కారణాలతో దీక్షలకు పిలుపునిచ్చారని, దీనివల్ల కేంద్ర హోంశాఖ జారీచేసిన కొవిడ్-19 నిబంధనల ఉల్లంఘనలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ ప్రస్తావించిన అంశాలన్నీ అవాస్తవమని, ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.