కరోనాపై వ్యాసం రాయండి..

ABN , First Publish Date - 2020-04-28T10:12:57+05:30 IST

కరోనా కట్టడి చర్యలను వ్యాసాలు, కథలు, పద్యాల రూపంలో అందించేలా చర్యలు తీసుకోవాలని వర్సిటీలకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఆదేశాలు జారీ ..

కరోనాపై వ్యాసం రాయండి..

  • బహుమతి పొందండి 
  • విద్యార్థులకు వర్సిటీల పోటీలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడి చర్యలను వ్యాసాలు, కథలు, పద్యాల రూపంలో అందించేలా చర్యలు తీసుకోవాలని వర్సిటీలకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విద్యార్థులకు 18 అంశాలను అధికారులు సూచించారు. వీటిపై వ్యాసాలు రాసి మే 10లోపు connectchancellor@ telangana.gov.in  కు మెయిల్‌ ద్వారా గానీ వాట్సప్‌ నెంబర్‌ 8978586666కు గానీ పంపించవచ్చు. మొదటి బహుమతి కింద రూ.15 వేలు, రెండో బహుమతిగా 10 వేలు, మూడో బహుమతిగా 5 వేలు అందించనున్నారు. వ్యాసాలు పంపే విద్యార్థులు వారి వివరాలను పేర్కొనాలి. 


వ్యాసాలు రాయాల్సిన అంశాలు

కరోనా కట్టడిలో ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా పాత్ర; తెలంగాణ ఆరోగ్య రంగంపై కరోనా ప్రభావం; సామాజిక దూరం పాటించడం, లాక్‌డౌన్‌ వల్ల ప్రభావం; ఆన్‌లైన్‌ విద్య అమలు; కరోనా కట్టడికి కృత్రిమ మేధను ఏ విధంగా ఉపయోగించవచ్చు; కరోనాపై అవగాహనపై సోషల్‌ మీడియా ఎలా ఉపయోపడుతుంది; ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉంటుంది  కరోనా కట్టడిలో సివిల్‌ సొసైటీ, ఎన్జీవోలు, రెడ్‌క్రాస్‌ సోసైటీల పాత్ర; కరోనా తర్వాత పరిస్థితి; కరోనా అనంతరం విద్యా రంగ పరిస్థితి.. ఈ రంగంపై ప్రభావం.

Updated Date - 2020-04-28T10:12:57+05:30 IST