ఇళ్లలోనే నమాజ్‌ చేయండి: అక్బరుద్దీన్‌ ఒవైసీ

ABN , First Publish Date - 2020-04-24T10:12:26+05:30 IST

రంజాన్‌ సందర్భంగా ముస్లింలందరూ సామూహిక ప్రార్థనల కోసం మసీదుల్లోకి వెళ్లకుండా ఇళ్లలోనే నమాజ్‌ చేసుకోవాలని..

ఇళ్లలోనే నమాజ్‌ చేయండి: అక్బరుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): రంజాన్‌ సందర్భంగా ముస్లింలందరూ సామూహిక ప్రార్థనల కోసం మసీదుల్లోకి వెళ్లకుండా ఇళ్లలోనే నమాజ్‌ చేసుకోవాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. కరోనా కష్టకాలంలో వచ్చిన రంజాన్‌ పవిత్ర మాసంలో ముస్లింలు పరస్పర సహకారం చేసుకుంటూ సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు మజ్లిస్‌ తరపున అవసరమైన నిత్యావసరాలు పంపిణీ చేస్తునట్లు తెలిపారు. సాలార్‌ ఏ మిల్లత్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు రూ.3 కోట్ల విలువైన నిత్యావసర సరుకులను ఎనిమిది వేల కుటుంబాలకు సమకూర్చినట్టు వెల్లడించారు.

Updated Date - 2020-04-24T10:12:26+05:30 IST