‘రోడ్డు భద్రత’కు రాష్ట్రానికి ఏటా 600 కోట్లు కావాలి
ABN , First Publish Date - 2020-03-13T09:03:16+05:30 IST
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏటా రూ.600 కోట్లు కేటాయించాలని ప్రపంచ బ్యాంకును రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ కృష్ణ ప్రసాద్ కోరారు. దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల

ప్రపంచ బ్యాంకును కోరిన రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్
హైదరాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏటా రూ.600 కోట్లు కేటాయించాలని ప్రపంచ బ్యాంకును రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ కృష్ణ ప్రసాద్ కోరారు. దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా నేషనల్ రోడ్ సేఫ్టీ ప్లాన్ రూపొందించిన కృష్ణ ప్రసాద్‌తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు గురువారం సమావేశమై చర్చించారు. రోడ్ సేఫ్టీ ప్లాన్‌ను ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.