స్వరాష్ట్రాలకు తరలిన కార్మికులు
ABN , First Publish Date - 2020-05-13T06:59:03+05:30 IST
మండలంలోని తుపాకులగూడెం గ్రామం వద్ద సమ్మ క్క బ్యారేజీ పనులు చేస్తున్న సుమారు వెయ్యి మందికి మంగళవారం వలస కార్మికులను

కన్నాయిగూడెం,మే12: మండలంలోని తుపాకులగూడెం గ్రామం వద్ద సమ్మ క్క బ్యారేజీ పనులు చేస్తున్న సుమారు వెయ్యి మందికి మంగళవారం వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించారు. బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు. వీరిని ఏటూరునాగారం తరలించి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లో వరంగల్ పంపారు. అక్కడి నుంచి రైళ్ల ద్వారా స్వరాష్ట్రాలకు తరలించారు.