కేసీఆర్‌లో అద్భుత నటుడు: బండి సంజయ్
ABN , First Publish Date - 2020-09-17T00:14:10+05:30 IST
సీఎం కేసీఆర్‌లో అద్భుత నటుడు ఉన్నాడని బీజేపీ నేత బండి సంజయ్ ఎద్దేవాచేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం నిసిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని, విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేతకాని తనమన్నారు.

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌లో అద్భుత నటుడు ఉన్నాడని బీజేపీ నేత బండి సంజయ్ ఎద్దేవాచేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం నిసిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని, విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేతకాని తనమన్నారు. అన్ని గ్రామాల్లో వెలుగులు నింపాలన్నదే ప్రధాని మోదీ ఆకాంక్ష.. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. విద్యుత్ సవరణ చట్టంతో ఉద్యోగాలు పోతాయని, కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని తప్పుబట్టారు. ముందు జీఎస్టీని వ్యతిరేకించిన కేసీఆర్.. తరువాత ఢిల్లీకి వెళ్లి మోదీ కాళ్లు పట్టుకున్నారని తెలిపారు. కేసీఆర్ అరాచకాలను ప్రజలు భరించే స్థితిలో లేరని సంజయ్ తెలిపారు.