మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమివ్వాలి: సత్యవతి

ABN , First Publish Date - 2020-09-25T05:30:00+05:30 IST

రాష్ట్రంలో మహిళలకు సరైన ప్రోత్సాహం, ఆర్థికంగా చేయూతను అందిస్తే ప్రపంచం గర్వించే పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతారని మంత్రి సత్యవతి రాథోడ్‌

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమివ్వాలి: సత్యవతి

హైదరాబాద్‌, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళలకు సరైన ప్రోత్సాహం, ఆర్థికంగా చేయూతను అందిస్తే ప్రపంచం గర్వించే పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతారని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా రూపొందించడానికి వీహబ్‌ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.


వీహబ్‌ మహిళా పారిశ్రామికవేత్తల గ్రాడ్యుయేషన్‌ డేను పురస్కరించుకుని శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆమె మాట్లాడారు. తెలంగాణ మహిళలు కష్టపడే తత్వం కలవారని, అవకాశం వస్తే తమని తాము నిరూపించుకుంటారని, అండగా ఉన్నామన్న భరోసా కల్పిస్తే అద్భుతాలనూ ఆవిష్కరిస్తారని ఆమె చెప్పారు.

Updated Date - 2020-09-25T05:30:00+05:30 IST