రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2020-12-18T16:36:26+05:30 IST

హైదరాబాద్: ఫిల్మ్ నగర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం జ్యోతిర్మయి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

హైదరాబాద్: ఫిల్మ్ నగర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం జ్యోతిర్మయి అనే మహిళను ఢీకొట్టింది. ఆ వెంటనే అతి వేగంగా వచ్చిన మరో టిప్పర్ తలకు తగలడంతో కుప్పకూలి పోయి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన జరిగిన వెంటనే టిప్పర్ లారీ డ్రైవర్, ద్విచక్ర వాహన దారుడు పరారయ్యారు. జ్యోతిర్మయి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Updated Date - 2020-12-18T16:36:26+05:30 IST