ప్రేమ పేరుతో మోసం.. పోలీసుల అదుపులో నిందితుడు
ABN , First Publish Date - 2020-12-30T23:08:27+05:30 IST
ఫేస్ బుక్‌లో పరిచయం చేసుకున్నాడు. మాయ మాటలతో మభ్య పెట్టాడు. లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాడు. హైదరాబాద్‌లో ..
హైదరాబాద్: ఫేస్ బుక్‌లో పరిచయం చేసుకున్నాడు. మాయ మాటలతో మభ్య పెట్టాడు. లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాడు. హైదరాబాద్‌లో మ్యూజిక్ టీచర్‌ను మోసం చేసిన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ్యూజిక్ టీచర్‌ను పెళ్లి చేసుకుంటానంటూ కరుణాకర్ రెడ్డి మోసం చేశాడు. శ్రీనగర్ కాలనీలోని కార్యాలయంలో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత మొహం చాటేశాడు. దీంతో పోలీసులకు యువతి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.