కంత్రీ కరోనాలు

ABN , First Publish Date - 2020-03-28T17:54:01+05:30 IST

కరోనా కాలం... కరెన్సీ ముట్టాలన్నా భయం... లాక్‌డౌన్‌తో దాదాపు ప్రతిదానికీ ఆన్‌లైన్‌ వైపు వెళ్లాల్సిన పరిస్థితులు పెరుగుతున్నాయి.

కంత్రీ కరోనాలు

ఆన్‌లైన్‌లో నకిలీ ఆఫర్లతో వల

చిక్కితే ఖాతాలు గల్లంతు

పోస్టర్‌ విడుదల చేసిన ఐఎ్‌సఈఏ

అప్రమత్తత అవసరమంటున్న పోలీసులు


కరోనా కాలం... కరెన్సీ ముట్టాలన్నా భయం... లాక్‌డౌన్‌తో దాదాపు ప్రతిదానికీ ఆన్‌లైన్‌ వైపు వెళ్లాల్సిన పరిస్థితులు పెరుగుతున్నాయి. తిరిగే వీలు తగ్గిపోతున్నప్పుడు కంప్యూటర్‌/మొబైలే కదా అన్నిటికీ గతి. సరిగ్గా ఇదే మయం... 

సైబర్‌ నేరగాళ్లకు మహా అవకాశాలకు గేట్లు తెరుస్తోంది. ఫిషింగ్‌, విషింగ్‌తో జరిగే 

మాయ అంతా ఇంతా కాదు. 


హైదరాబాద్‌,  (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ విస్తరిస్తోంది. సైబర్‌ నేరగాళ్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేరుతో నకిలీ ఈ-మెయిల్స్‌ పంపుతూ.. కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లలోకి మాల్‌వేర్‌ను చొప్పిస్తున్నారు. ఛిఛీఛిఛిౌఠిజీుఽఛీ19ఃఛిఛీఛి.జౌఠి నుంచి ‘కరోనా వైరస్‌ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అంటూ మెయిల్స్‌ పంపుతున్నారు. ఆ మెయిల్స్‌లో ‘సేఫ్టీ ప్రికాషన్స్‌’ పేరుతో ఉండే అటాచ్‌మెంట్‌ను ఓపెన్‌ చేస్తే.. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్లలోని సమస్త సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. క్షణాల్లో బ్యాంకు ఖాతాల వివరాలను తస్కరించి, నగదు కాజేస్తున్నారు. ఈ తరహా మెయిల్స్‌ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.    


కొత్తపేట, (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో మాస్క్‌లు, శానిటైజర్ల వినియోగం పెరిగింది. బహిరంగ మార్కెట్‌లో వీటి ధర కూడా పెరిగింది. చాలా చోట్ల మాస్క్‌లు నోస్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. శానిటైజర్లు అసలు కనిపించడమే లేదు. ఈ తరుణంలో కొందరు నకిలీ ఆఫర్లతో వినియోగదారులను బురడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆన్‌లైన్‌లో మాస్కులు, శానిటైజర్ల మాటున సైబర్‌ మాయగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరకే మాస్క్‌లు, శానిటైజర్లు అంటూ ప్రకనలు ఇచ్చి డబ్బులు దోచేస్తున్నారు. ఇలాంటి నేరాలపై అప్రమత్తం చేసే దిశగా నగరంలోని ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ (ఐఎ్‌సఈఏ), సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డాక్‌) సలహాలు, సూచనలతో వెబ్‌పోస్టర్‌ను విడుదల చేసింది.


ఫిషింగ్‌, విషింగ్‌తో బురిడీ..

ఫిషింగ్‌ (పీహెచ్‌ఐఎ్‌సహెచ్‌ఐఎన్‌జీ), విషింగ్‌ (వాయిస్‌ ఫిషింగ్‌)తో సైబర్‌ నేరస్తులు మాయ చేస్తున్నారు. అందరినీ ఆందోళనకు గురిచేస్తోన్న అత్యాధునిక చౌర్యాలే ఫిషింగ్‌, విషింగ్‌. ఈ- మెయిల్‌, టెక్ట్స్‌ మెసేజ్‌ తదితర ఎలకా్ట్రనిక్‌ మాధ్యమాల ద్వారా యూజర్‌నేమ్‌ పాస్‌వర్డ్‌, బ్యాంక్‌ ఖాతా, క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు, పిన్‌ నంబర్‌ వంటి వివరాలు తెలుసుకుని బ్యాంక్‌ ఖాతాలోని డబ్బులు కొల్లగొట్టడం ఫిషింగ్‌. అపరిచిత వ్యక్తి బ్యాంకు నుంచి కాల్‌ చేస్తున్నానంటూ నమ్మిస్తాడు. అలా డెబిట్‌ కార్డు/ క్రెడిట్‌ కార్డ్‌  పిన్‌ నెం. బ్యాంక్‌ ఖాతా తదితర వివరాలు తెలుసుకుని క్షణాల్లో ఖాతాలోని డబ్బును తమ ఖాతాలోకి బదిలీ చేసుకోవడం విషింగ్‌. మాస్కులు, శానిటైజర్ల కొనుగోళ్ల విషయంలోనూ అపరిచితుల మెసేజీలక, కాల్స్‌కూ స్పందిస్తూ   మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 


తక్కువ ధరకే అంటే..  

నాణ్యమైన మాస్క్‌లు, శానిటైజర్లు తక్కువ ధరకే అంటూ సోషల్‌ మీడియా/ఆన్‌లైన్‌ ప్రకటనలు చూసి మోసపోవద్దని ఐఎ్‌సఈఏ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు చూసిన వారు ఇతరులకు విక్రయించడానికి లేదా కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల కోసం పెద్దమొత్తంలో మాస్కులు, శానిటైజర్లు ఆర్డర్‌ చేసే ముందు సైబర్‌ నిపుణులు సూచనలు పాటించాలని, లేకుంటే సైబర్‌ నేరస్తుల యాయలో పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్రకటనలతో బురడీ కొట్టించే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.  


అధికారికమేనా? 

నెట్టింట్లో కుప్పలు తెప్పలుగా వచ్చి పడే ప్రకటనల్లో ఏది నకిలీ.. ఏది అసలు గుర్తించాలంటే సదరు వెబ్‌సైట్‌ అధికారికత/ప్రామానికతను తెలుసుకోవాలి. సెర్చ్‌ ఇంజన్‌లో వెబ్‌సైట్‌ పేరు టైప్‌ చేయాలి, కనెక్షన్‌ టైప్‌ పరిశీలించాలి. హెచ్‌టీటీపీఎస్‌ అని ఉంటే అసలైన వెబ్‌సైట్‌గా గుర్తించాలి. హెచ్‌టీటీపీ ఉంటే నకిలీ అని గుర్తించాలి. వెబ్‌సైట్‌ ఎస్‌ఎ్‌సఎల్‌ సర్టిఫికెట్‌, ట్రస్ట్‌ సీల్‌ పరిశీలించాలి. సాధారణంగా నకిలీ వెబ్‌సైట్‌లలో ఇంగ్లిష్‌ స్పెల్లింగ్‌,  గ్రామర్‌ మిస్టెక్స్‌, అసంబద్ధంగా సమాచారం ఉంటుంది. 


ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలి..

నకిలీ ఆన్‌లైన్‌ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలి. వెబ్‌సైట్‌ 

ప్రామాణికతపై దృష్టి పెట్టాలి. సైబర్‌ సెక్యూరిటీపై ఎలాంటి 

సందేహాలున్నా 18004256235కు కాల్‌ చేసి గాని, www.InfoSecawareness.in  వెబ్‌సైట్‌ ద్వారా గానీ 

మరింత సమాచారం పొందొచ్చు. 

-ఎం.జగదీష్‌ బాబు, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, ఐఎ్‌సఈఏ, హైదరాబాద్‌     


అవగాహన కల్పిస్తున్నాం.. 

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ నేరాలు నివారణపై అవగాహన కల్పిస్తున్నాం. ఈ మేరకు పోస్టర్లను, ఫ్లెక్సీలను జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నాం. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన తక్కువ నిడివి గల వీడియోలను ప్రదర్శిస్తున్నాం. సైబర్‌ సెక్యూరిటీపై ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా డయల్‌ 100 లేదా 94906 17111 నెంబర్‌కు వాట్సాప్‌ చేయవచ్చు. ఆన్‌లైన్‌ మోసాలకు గురైన వారు ఎల్‌బీనగర్‌ రాచకొండ సైబర్‌ సెల్‌ విభాగంలో ఫిర్యాదు చేయవచ్చు. సైబర్‌ నిపుణుల సూచనలు పాటించాలి. తెలుసుకుని అందరికీ అవగాహన కల్పించాలి.

మహేష్‌ మురళీధర్‌ భాగవత్‌, 

సీపీ, రాచకొండ

Updated Date - 2020-03-28T17:54:01+05:30 IST