లాక్‌డౌన్‌లో జోరుగా మద్యం.. ఎక్కడో తెలుసా?

ABN , First Publish Date - 2020-04-06T01:17:16+05:30 IST

నారాయణపూర్ మండలో మద్యం ఏరులై పారుతోంది. లాక్‌డౌన్ కారణంగా వైన్ షాపులు మూసి ఉండటంతో..

లాక్‌డౌన్‌లో జోరుగా మద్యం.. ఎక్కడో తెలుసా?

యాదాద్రి: నారాయణపూర్ మండలో మద్యం ఏరులై పారుతోంది. లాక్‌డౌన్ కారణంగా వైన్ షాపులు మూసి ఉండటంతో బెల్టు షాపుల యజమానులు తమ ఇష్టమొచ్చిన రేట్లకు మద్యం అమ్ముతున్నారు. ఓసీ క్వార్టర్ రూ.400, లైట్ బీర్ రూ. 300, స్ట్రాంగ్ బీర్ రూ.350, బ్లెండర్ స్ప్రైడ్ రూ.3000, సిగ్నేచర్ రూ,2500కు విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులు కొల్లగొడుతున్నారు.


మండలంలోని జనగాం, కోతులపురం, సర్వేల్, వావిళ్లపల్లి, మల్లారెడ్డిగూడెం వంటి తండాలలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. జనగాంలో మహిళా సంఘాలు, గ్రామస్తులు బెల్ట్ షాపులపై దాడులు చేసి మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా బెల్ట్ షాపుల యాజమానులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. 

Updated Date - 2020-04-06T01:17:16+05:30 IST