పార్టీ బలోపేతానికి కృషి చేస్తా

ABN , First Publish Date - 2020-03-19T11:13:58+05:30 IST

భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొండేటి శ్రీధర్‌ పదవీ బాధ్యతలను చేపట్టారు. బుధవారం హన్మకొండలోని పార్టీ రూరల్‌ జిల్లా కార్యా లయంలో ఆయన మాజీ

పార్టీ బలోపేతానికి కృషి చేస్తా

బీజేపీ రూరల్‌ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొండేటి శ్రీధర్‌

18 సంగెం 8 కొండేటి శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగిస్తున్న ఎడ్ల అశోక్‌రెడ్డి, తదితరులు


వరంగల్‌ రూరల్‌, మార్చి 18: భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొండేటి శ్రీధర్‌ పదవీ బాధ్యతలను చేపట్టారు. బుధవారం హన్మకొండలోని పార్టీ రూరల్‌ జిల్లా కార్యా లయంలో ఆయన మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌ రెడ్డి నుంచి బాధ్యతలను స్వీకరించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నేతలు శ్రీధర్‌ను అభినందించారు. కార్యాలయంలో పార్టీ  పతా కాన్ని శ్రీధర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని పార్టీ బలోపేతానకి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, మార్తినేని ధర్మారావు, డాక్టర్‌ టి.రాజేశ్వర్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కట్ట సుధాకర్‌రెడ్డి, పార్టీ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు తాళ్లపె ల్లి కుమారస్వామి, రాజవీరు, ఈగ మల్లేశం, సారంగరావు, ముత్యాల శ్రీనివాస్‌, త్రిలోకేశ్వర్‌, రేసు శ్రీనివాస్‌, గాడిపెల్లి రాజేశ్వర్‌రావు, ముతి ్తరెడ్డి కేశవరెడ్డి శ్రీధర్‌ను సత్కరించారు. 


బీజేపీకి కొత్త బలం వస్తోంది...

రాష్ట్రంలో బీజేపీకి కొత్త బలం చేకూరుతోం దని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు.  హన్మకొండలోని వి ష్ణుప్రియ గార్డెన్‌లో పార్టీ  రూరల్‌ జిల్లా సమావేశం ఎడ్ల అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ గ్రామస్థాయిలో పార్టీ బలోపేతమవుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ పాలన పై ప్రజలు విముఖత   చూపుతున్నారని, రా బోయే రోజుల్లో  రాంరాం  చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.


జిల్లా ఇన్‌చార్జి కట్ట సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు. రేవూరి ప్రకాశ్‌ రెడ్డి మాట్లాడుతూ కట్టుబాట్లతో కూడిన పార్టీ గా బీజేపీకి గుర్తింపు ఉందని చెప్పారు. వన్నా ల శ్రీరాములు మాట్లాడుతూ బడుగు, బల హీన వర్గాల పార్టీగా బీజేపీ ప్రజల మనసు ల్లోకి వెళ్లిందన్నారు. డాక్టర్‌ టి.రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీకి ప్రజల ఆదరణ పెరిగిందన్నారు. కొండేటి శ్రీధర్‌ మాట్లాడుతూ దేశంలో దళిత సామాజిక వర్గాలకు బీజేపీ పెద్దపీట వేస్తోందని తెలిపారు.

Updated Date - 2020-03-19T11:13:58+05:30 IST