బ్యాంకులు మూతపడనున్నాయా ?

ABN , First Publish Date - 2020-05-18T00:25:50+05:30 IST

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బ్యాంకులు కొన్నాళ్ళపాటు మూతపడనున్నాయా ? ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తోందా ? త్వరలోనే నిర్ణయం జరగనుందా ? ఈ ప్రశ్నలకు ‘అవును’ అనే సమాధానమే వినవస్తోంది. ఇంతకీ ఈ చర్చకు కారణం... ‘కరోనా’. ఓ మహిళ కారణంగా బ్యాంకులో కరోనా సోకినట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే.

బ్యాంకులు మూతపడనున్నాయా ?


హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బ్యాంకులు కొన్నాళ్ళపాటు మూతపడనున్నాయా ? ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తోందా ? త్వరలోనే నిర్ణయం జరగనుందా ? ఈ ప్రశ్నలకు ‘అవును’ అనే సమాధానమే వినవస్తోంది. ఇంతకీ ఈ చర్చకు కారణం... ‘కరోనా’. ఓ మహిళ కారణంగా బ్యాంకులో కరోనా సోకినట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే.


ఈ క్రమంలో... బ్యాంకులను పూర్తిగా మూసివేసే దిశగా సమాలోచనలు జరుగుతున్నట్లు వినవస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఈ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇందుకు సంబంధించి సరైన స్పష్టతనివ్వడంలేదు. కేవలం కొద్ది రోజులపాటు మాత్రం లావాదేవీలను మూసివేయడమో లేదా బ్యాంకు సిబ్బందికి కూడా వీలున్నంతమేరకు ‘వర్క్ ‌ఫ్రం హోంై’ మాదిరిగా పనిచేసేలా చర్యలు తీసుకోవచ్చని వినవస్తోంది.


లేదా లావాదేవీలకు సంబంధించిన విధానాన్ని మరికొంత మెరుగుపరచి, ‘ఆన్‌లైన్ై’ లావాదేవీల ద్వారానే కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవచ్చని వినవస్తోంది. 

Updated Date - 2020-05-18T00:25:50+05:30 IST