గోమాతను అవమానించిన వ్యక్తిని ఎందుకు నిలదీయలేదు?
ABN , First Publish Date - 2020-11-25T07:38:12+05:30 IST
ముస్లింలపై అంత గుడ్డి ద్వేషం ఎందుకంటూ మాట్లాడిన మంత్రి కేటీఆర్.. గతంలో ఎంఐఎం ముఖ్యనేత

మంత్రి కేటీఆర్‌కు విజయశాంతి ప్రశ్న
హైదరాబాద్, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ముస్లింలపై అంత గుడ్డి ద్వేషం ఎందుకంటూ మాట్లాడిన మంత్రి కేటీఆర్.. గతంలో ఎంఐఎం ముఖ్యనేత చేసిన వ్యాఖ్యలు గుర్తు లేనట్లుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత విజయశాంతి దుయ్యబట్టారు. హిందువులు పవిత్రంగా ఆరాధించే గోమాతను ఉద్దేశించి చులకనగా మాట్లాడారన్నారు.
ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని.. ‘హిందువులపై అంత గుడ్డి ద్వేషం ఎందుకు?’ అంటూ నిలదీయలేదెందుకని మంత్రి కేటీఆర్‌ను ఒక ప్రకటనలో ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసం టీఆర్‌ఎస్ మత రాజకీయాలకు తెగబడుతున్నట్టు స్పష్టమవుతోందని పేర్కొన్నారు.