ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. కేసీఆర్‌ ఎందుకు మాట్లాడలేదు?: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2020-10-03T20:04:33+05:30 IST

ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. కేసీఆర్‌ ఎందుకు మాట్లాడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు...

ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. కేసీఆర్‌ ఎందుకు మాట్లాడలేదు?: బండి సంజయ్‌

హైదరాబాద్: కుట్రలో భాగంగానే కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని, ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. కేసీఆర్‌ ఎందుకు మాట్లాడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్‌కు ముందే లేఖ రాయడం వెనుక అంతర్యమేంటని, గతంలో అపెక్స్ కౌన్సిల్‌ సమావేశాన్ని కేసీఆర్ వాయిదా వేయించారని ఆయన గుర్తు చేశారు. కేంద్రం రైతుల కోసం అద్భుతమైన చట్టం తీసుకొచ్చిందని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసమే సీఎం వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. రైతులు బాగుపడటం కేసీఆర్‌కు ఇష్టం లేదని, కాంగ్రెస్, కమ్యూనిస్టుల పంచన కేసీఆర్ చేరిపోయారని అన్నారు. సీఎం కేసీఆర్‌ తన విధానాలను మార్చుకోవాలని, రైతు ఎక్కడైనా పంటలను అమ్ముకునే స్వేచ్ఛను వ్యవసాయ చట్టం కల్పిస్తుందని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-10-03T20:04:33+05:30 IST