పాతబస్తీలో పాకిస్థానీలు ఎవరో 24 గంటల్లో చెప్పాలి
ABN , First Publish Date - 2020-11-25T07:37:13+05:30 IST
‘బీజేపీకి 24 గంటల సమయం ఇస్తున్నాం.. పాతబస్తీలో పాకిస్థాన్ వాళ్లెవరో... రోహింగ్యాలు ఎవరో చెప్పాలి’ అని ఎంఐఎం అధ్యక్షుడు,

దేశవ్యాప్తంగా ఎంఐఎంకి ప్రజాదరణ: అసదుద్దీన్
హైదరాబాద్/ముషీరాబాద్, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘బీజేపీకి 24 గంటల సమయం ఇస్తున్నాం.. పాతబస్తీలో పాకిస్థాన్ వాళ్లెవరో... రోహింగ్యాలు ఎవరో చెప్పాలి’ అని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మంగళవారం భోలక్‌పూర్‌లో ఎంఐఎం ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్ చేస్తామని చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్పందించారు. పాతబస్తీ హైదరాబాద్‌లో లేదా అని ఆయన ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు ఎంఐఎం పార్టీకి ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. ఘాన్సీమజార్‌లో బీజేపీ అభ్యర్థి రేణుసోను తప్పుడు అపిడవిట్ దాఖలు చేసి బరిలో నిలిచారని అసదుద్దీన్ ఆరోపించారు. ఘాన్సీబజార్‌లో ఒవైసీ పాదయాత్ర చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. .