మా కేసీఆర్ ఎక్కడ?... యువకుల మెరుపు నిరసన
ABN , First Publish Date - 2020-07-08T23:48:50+05:30 IST
సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతిభవన్ వద్ద ఆకస్మాత్తుగా ఇద్దరు యువకులు మెరుపు నిరసనకు..
హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతిభవన్ వద్ద అకస్మాత్తుగా ఇద్దరు యువకులు మెరుపు నిరసనకు దిగారు. ప్రగతిభవన్ ఎగ్జిట్ వైపు బైక్‌పై వెళ్లిన యువకులు.. ‘‘ సీఎం కేసీఆర్ ఎక్కడ?.. ఆయన మా సీఎం. ఆయన ఎక్కడ ఉన్నడో తెలుసుకోవడం మా హక్కు’’ అంటూ ఇంగ్లీష్‌లో రాసిన ప్లేకార్డును ప్రదర్శించి వెళ్లిపోయారు. ఈ ఘటన మెరుపు వేగంతో జరగడం వల్ల పోలీసులు ఆ యువకులను పట్టుకోలేకపోయినట్లు తెలిసింది. యువకుల కోసం స్థానిక సీసీఫుటేజ్‌లను పరిశీలించడంతో పాటు వారిని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.