నక్సలైట్లే‌ టాప్ అజండాగా సీఎం, డీజీపీ భేటి

ABN , First Publish Date - 2020-10-07T08:12:32+05:30 IST

సీఎం కేసీఆర్‌ బుధవారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. డీజీపీ, ఆయా విభాగాల అధిపతులతో సీఎం తరచూ సమావేశమవుతూనే ఉన్నా..

నక్సలైట్లే‌ టాప్ అజండాగా సీఎం, డీజీపీ భేటి

 కట్టడికి అనుసరిస్తున్న ప్రతివ్యూహాలేంటి?

 నేడు పోలీసు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష 


హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ బుధవారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. డీజీపీ, ఆయా విభాగాల అధిపతులతో సీఎం తరచూ సమావేశమవుతూనే ఉన్నా.. డీజీపీ నుంచి ఎస్పీ స్థాయి అధికారులతో మాత్రం సుమారు మూడేళ్ల తర్వాత భేటీ అవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. మావోయిస్టుల అంశమే ప్రధాన ఎజెండా కావచ్చనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల నెలల వ్యవధిలోనే తెలంగాణలో మావోయిస్టుల కదలికలు బయటపడటం, రోజుల వ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఐదు ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోవడం తెలిసిందే. దీంతోపాటు మావోయిస్టు కీలక నేతలు కొందరు లొంగిపోతారనే ప్రచారం కూడా జరిగింది. ఏకంగా డీజీపీ స్వయంగా మన్యం బాటపట్టి రోజుల తరబడి అక్కడే ఉండి, పరిస్థితుల్ని పరిశీలించారు.


ఈ నేపథ్యంలో మన్యంలో పోలీ్‌సలు అనుసరిస్తున్న వ్యూహాలు, అడవుల్లో గాలింపు, తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టు నేతలు, మావోయిస్టు పార్టీ ప్రస్తుత పరిస్థితి... ఇలా అన్ని అంశాలపై అధికారులతో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల్ని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఇటీవల జరిగిన కేంద్ర హోంశాఖ సలహాదారు విజయ్‌కుమార్‌, ఛత్తీ్‌సగఢ్‌, సీఆర్‌పీఎస్‌, బీఎ్‌సఎఫ్‌ తదితర విభాగాల అధికారులతో జరిగిన సమావేశం తీసుకున్న నిర్ణయాలు, అనుసరించాల్సిన విధానాల పైనా సీఎం చర్చించనున్నట్లు, పోలీసు శాఖకు మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారని తెలుస్తోంది.


మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపైనా సీఎం ఆరా తీయనున్నారు. పోలీస్‌ సిబ్బంది సంక్షేమం, కరోనా బారినపడ్డవారు, ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలరే అందించాల్సిన పరిహారంపె ౖకూడా అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు కలప అక్రమ రవాణా, అటవీ భూముల ఆక్రమణ, వణ్యప్రాణుల సంరక్షణ ఇతర అంశాలకు సంబంధించి అటవీ శాఖ అధికారులతోనూ ముఖ్యమంత్రి చర్చిస్తారు.


Read more