మావోయిస్టుల వ్యూహాలేంటి?
ABN , First Publish Date - 2020-10-07T07:47:59+05:30 IST
సీఎం కేసీఆర్ బుధవారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. డీజీపీ నుంచి ఎస్పీ స్థాయి అధికారులతో మాత్రం సుమారు మూడేళ్ల తర్వాత

నేడు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ బుధవారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. డీజీపీ నుంచి ఎస్పీ స్థాయి అధికారులతో మాత్రం సుమారు మూడేళ్ల తర్వాత భేటీ అవుతుండడంతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. మావోయిస్టుల అంశమే ప్రధాన అజెండా కావచ్చనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో మావోయిస్టుల కదలికలు బయటపడటం, రోజుల వ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఐదు ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాలు, తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టు నేతలు, మావోయిస్టు పార్టీ ప్రస్తుత పరిస్థితి.. ఇలా అన్ని అంశాలపై అధికారులతో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది.