నాణ్యమైన జీవనానికి చేయూత
ABN , First Publish Date - 2020-11-25T08:22:58+05:30 IST
మహిళలు సంపూర్ణ ఆరోగ్యంతోపాటు నాణ్యమైన జీవనాన్ని సాగించేందుకు న్యాయ సేవాధికార సంస్థ అండగా నిలుస్తోందని న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ కార్యదర్శి జీవీ.మహేష్ స్పష్టం చేశారు.

వర్ధన్నపేట, నవంబరు 24 : మహిళలు సంపూర్ణ ఆరోగ్యంతోపాటు నాణ్యమైన జీవనాన్ని సాగించేందుకు న్యాయ సేవాధికార సంస్థ అండగా నిలుస్తోందని న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ కార్యదర్శి జీవీ.మహేష్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కలెక్టర్ సహకారంతో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్‌జీవోల్లో పనిచేస్తున్న సెక్స్‌వర్కర్లకు మంగళవారం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో బియ్యం పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో సరైన జీవనోపాధి లేని సెక్స్ వర్కర్లను గుర్తించి ప్రతీ ఒక్కరికి 10 కిలోల బియ్యం అందజేశారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, ప్రోగ్రాం మేనేజర్ స్వప్నమాధురి, సర్వోదయ ఆర్గనైజేషన్ ప్రతినిధులు డాక్టర్ నర్సింహారెడ్డి, హెచ్‌ఈవో రాజు తదితరులు పాల్గొన్నారు.