మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి
ABN , First Publish Date - 2020-11-25T08:22:21+05:30 IST
పంటలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి ఏఐకేఎ్‌ససీసీ జిల్లా కన్వీనర్ పెద్దారపు రమేష్,...

కలెక్టరేట్ వద్ద రైతు సంఘం ధర్నా
వరంగల్ రూరల్ కల్చరల్, నవంబరు 24: పంటలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి ఏఐకేఎ్‌ససీసీ జిల్లా కన్వీనర్ పెద్దారపు రమేష్, జిల్లా కో కన్వీనర్ రాచర్ల బాలరాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐకేఎ్‌ససీసీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ రైతు, ప్రజా సంఘాలు కలిసి ఏకశిల పార్కు నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు ప్రయోజనాలకు భంగం కలిగించే కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం లాక్‌డౌన్ అదనుగా చేసుకొని వ్యవసాయాన్ని కార్పొరేట్ల పెత్తనానికి అప్పగించేందుకు మూడు చట్టాలను తెచ్చిందన్నారు.
ఈ చట్టాల అమలుతో భారత వ్యవసాయ రంగానికి పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు వెళ్లి రైతులను కూలీగా మారుస్తాయన్నారు. వర్షాలతో పంటలు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం అందించాలన్నారు. అనంతరం డీఆర్‌వో హరిసింగ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘాల బాధ్యులు ఎన్‌రెడ్డి హంసారెడ్డి, చిర్ర సూరి, ఈర్ల పైడి, గౌడగాని శివాజీ, జనగాం కుమారస్వామి, మొగిలి ప్రతా్‌పరెడ్డి, సోమిడి శ్రీనివాస్, వీరగోని శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.