ప్రకృతి వనాల పనులు త్వరగా పూర్తిచేయాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-11-25T08:18:07+05:30 IST

పల్లె ప్రజలు సేదతీరే పల్లె ప్రకృతి వనాలను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ హరిత ఆదేశించారు. మంగళవారం సాయిరెడ్డిపల్లెలో నూతనంగా నిర్మించే పల్లె ప్రకృతి వనం స్థలాన్ని, ...

ప్రకృతి వనాల పనులు త్వరగా పూర్తిచేయాలి: కలెక్టర్‌

 నల్లబెల్లి, నవంబరు 24: పల్లె ప్రజలు సేదతీరే పల్లె ప్రకృతి వనాలను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ హరిత ఆదేశించారు. మంగళవారం సాయిరెడ్డిపల్లెలో నూతనంగా నిర్మించే పల్లె ప్రకృతి వనం స్థలాన్ని, నల్లబెల్లిలో రైతు వేదికను, మూడుచెక్కలపల్లెలో పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్‌ సందర్శించారు. నల్లబెల్లిలోని ప్రధాన రోడ్డు డివైడర్‌లో నాటిన మొక్కల చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. లెంకాలపల్లెలో డంపింగ్‌యార్డ్‌ ఉన్నా రోడ్డు పక్కన చెత్త పోయడంపై అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో చెత్తను తీసివేయాలని ఆదేశించారు.


కార్యక్రమాల్లో డీఆర్‌డీవో సంపత్‌రావు, జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పెద్ది స్వప్న, ఎంపీపీ ఊడ్గుల సునిత, పీఏసీఎస్‌ చైర్మన్‌ చెట్టుపల్లి మురళీధర్‌, వైస్‌ చైర్మన్‌ టి.మోహన్‌రావు, ఎంపీడీవో శంకర్‌, ఎంపీవో ప్రకాశ్‌, సర్పంచ్‌లు రాజారాంయాదవ్‌, రత్నాకర్‌రావు, పూల్‌సింగ్‌, పద్మ తదితరులు పాల్గొన్నారు.


ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ మంగళవారం ప్రారంభించారు. మేడపల్లి, గుండ్లపాడ్‌, గోవిందాపురం, నాగరాజుపల్లె గ్రామాల్లోని కేంద్రాలను జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పెద్ది స్వప్న, ఎంపీపీ సునిత, పీఏసీఎస్‌ చైర్మన్‌ మురళీధర్‌, వైస్‌ చైర్మన్‌ మోహన్‌రావులు ప్రారంభించారు. కార్యక్రమాల్లో డీఆర్‌డీవో సంపత్‌రావు, పాల్గొన్నారు.

Read more