ఎస్సార్‌యూలో కొనసాగుతున్న ఫ్యాకల్టీ రీఫ్రెషర్‌ ప్రోగ్రాం

ABN , First Publish Date - 2020-11-25T08:09:11+05:30 IST

అనంతసాగర్‌లోని ఎస్సార్‌ విశ్వవిద్యాలయం(ఎస్సార్‌యూ)లోని స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఈసీఈ విభాగంలో ఏఐసీటీఈ-ఐఎ్‌సటీఈ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ రీఫ్రెషర్‌ ప్రోగ్రామ్‌ మంగళవారానికి ...

ఎస్సార్‌యూలో కొనసాగుతున్న ఫ్యాకల్టీ రీఫ్రెషర్‌ ప్రోగ్రాం

వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, నవంబరు 24: అనంతసాగర్‌లోని ఎస్సార్‌ విశ్వవిద్యాలయం(ఎస్సార్‌యూ)లోని స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఈసీఈ విభాగంలో ఏఐసీటీఈ-ఐఎ్‌సటీఈ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ రీఫ్రెషర్‌ ప్రోగ్రామ్‌ మంగళవారానికి రెండో రోజుకు చేరింది. ఇందులో భాగంగా ‘ఎఫెక్టివ్‌ టీచింగ్‌ స్కిల్స్‌ ఫర్‌ ఔట్‌కమ్‌ బేస్డ్‌ ఇంజనీరింగ్‌ ఎడ్యుకేషన్‌’ అనే అంశంపై రెండో రోజు పలువురు ప్రొఫెసర్లు ప్రసంగించారు. ఏఐసీటీఈ అడ్వయిజర్‌ ప్రొఫెసర్‌ రాజేంద్ర  బి కాగ్డే మాట్లాడుతూ.. భారతదేశంలో సాంకేతిక విద్య నూతన ఒరవడులు తొక్కుతూ ప్రపంచ దేశాలకు దేశాలకు దీటుగా నిలుస్తోందన్నారు.


ఐఎ్‌సటీఈ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ ప్రొఫెసర్‌ కె.రాజనరేందర్‌రెడ్డి మాట్లాడుతూ..ఔట్‌కమ్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌ విధానం ప్రస్తుత తరుణంలో నూతన మార్పులను తీసుకువస్తోందన్నారు. వర్చువల్‌ మీటింగ్‌ విధానంలో జరిగిన ఈ సెమినార్‌లో ఎస్సార్‌ ఇంజనీరింగ్‌ కళాశాల డీన్‌ డాక్టర్‌ వి.మహేష్‌,  కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జె.తరుణ్‌కుమార్‌, అధ్యాపకులు రాజేంద్రప్రసాద్‌, డాక్టర్‌ వి.సందీ్‌పకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more