ఆచార్య సిద్ది వీరేశంకు అరుదైన గౌరవం
ABN , First Publish Date - 2020-11-25T08:06:47+05:30 IST
కేయూ ఫార్మసీ విభాగం రిటైర్డు ప్రొఫెసర్ సిద్ధి వీరేశం ప్రపంచవ్యాప్త శాస్త్రవేత్తల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. యుఎ్‌సఏకు చెందిన స్టాండ్‌ఫోర్డ్ యూనివర్సిటీ అధికారులు మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించారు.

ప్రపంచవ్యాప్త శాస్త్రవేత్తల జాబితాలో చోటు
కేయూ క్యాంపస్, నవంబరు 24: కేయూ ఫార్మసీ విభాగం రిటైర్డు ప్రొఫెసర్ సిద్ధి వీరేశం ప్రపంచవ్యాప్త శాస్త్రవేత్తల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. యుఎ్‌సఏకు చెందిన స్టాండ్‌ఫోర్డ్ యూనివర్సిటీ అధికారులు మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 22 శాస్త్రీయ రంగాలు, వీటికి అనుసంధానంగా ఉన్న 176 శాస్త్రీయ పరిశోధన ఉపరంగాలకు చెందిన నిపుణుల నుంచి 2శాతం శాస్త్రవేత్తలను ఎంపిక చేయగా వారిలో వీరేశంకు చోటు దక్కడం విశేషం.అకడమిక్, పరిశోధన రంగాల్లో చేసిన కృషి ప్రాతిపదికగా ఈ ఎంపిక జరిగింది. వీరేశం 25మంది పీహెచ్‌డీ స్కాలర్లకు పర్యవేక్షలుగా వ్యవహరించారు. ఇప్పటివరకు 150 పరిశోధన పత్రాలను రాశారు.
10దేశాల్లో పర్యటించారు. కార్నెల్ యూనివర్సిటీలో యూనెస్కో పోస్టు డాక్టోరల్ ఫెల్లోగా రెండేళ్లు పనిచేశారు. రెండు పేటెంట్లు కలిగిఉన్నారు. యూనెస్కో- బీఏసీ అవార్డు లభించింది. గతంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. మధుమేహ వ్యాధి- నియంత్రణ, పర్యవసానాలు మానవ శరీరంలో ఇతర భాగాలపై దాని ప్రభావం, తీవ్రత, నిష్పత్తిపై వీరేశం పరిశోధనలు చేశారు. జాతీయ పరిశోధన సంస్థల నుంచి రూ.కోటి విలువైన ప్రాజెక్టులు పూర్తిచేశారు.