చేనేత ఉత్పత్తులను ప్రొత్సహించాలి

ABN , First Publish Date - 2020-11-19T09:37:16+05:30 IST

చేనేత ఉత్పత్తులను ప్రొత్సహించాలి

చేనేత ఉత్పత్తులను ప్రొత్సహించాలి

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలాసత్పతి


వరంగల్‌ సిటీ, నవంబరు 18: చేనేత ఉత్పత్తులను ప్రతీఒక్కరు ప్రొత్సహించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతి కోరారు. వరంగల్‌ కొత్తవాడలోని క్షతంజీ హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీని టెక్స్‌టైల్స్‌ ఓఎ్‌సడీ డాక్టర్‌ తౌటం శాంతతో కలిసి బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ జీడబ్ల్యూఎంసీ నుంచి చేనేత రంగానికి తగిన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. 


పర్యావరణానికి ముప్పు తెచ్చే ప్లాస్టిక్‌ను నిషేధించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. వ్యాపార సంస్థలు సహకరించాలని  లేకుంటే సీజ్‌ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధాన్ని యజ్ఞంగా భావించాలని పిలుపునిచ్చారు.  

Updated Date - 2020-11-19T09:37:16+05:30 IST