నామినేటేడ్‌ పదవులపై నజర్‌

ABN , First Publish Date - 2020-03-02T11:29:25+05:30 IST

నామినేటేడ్‌ పదవులపై నజర్‌

నామినేటేడ్‌ పదవులపై నజర్‌

 రాజ్యసభ పై ఆశావహుల ఎదురు చూపులు

మార్చి 6న విడుదల కానున్న నోటిఫికేషన్‌..!

రేసులో మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్‌, పార్టీ సీనియర్లు తక్కెళ్లపల్లి, నూకల, బీరవెల్లి 

ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ


మహబూబాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : వరుస ఎన్నికలు పూర్తయి పోయాయి... అసెంబ్లీ ఎన్నిక ల నుంచి తాజాగా ముగిసిన డీసీసీబీ, ఓడీసీఎంఎస్‌ ఎన్నికల వరకు అన్నీ గులాబీ వశమైపోయాయి. ఇక రాజ్యసభ, నామినేటేడ్‌ పదవుల సీజన్‌ వచ్చేసింది. రాష్ట్రంలో రెండు రాజ్యసభ సీట్ల భర్తీలో ఒకటి ముఖ్య మంత్రి కేసీఆర్‌ తనయ, నిజమాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత దాదాపు ఖాయమని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. మరోసీటు విషయంలో సామాజిక వర్గాల కోణంలో ఎంపిక ఉంటుందన్న ఊహాగానాల క్రమంలో మహబూబాబాద్‌ మాజీ ఎంపీ, ప్రొఫెసర్‌ అజ్మీర సీతారాంనాయక్‌ ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది. ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించే అవ కాశం ఉంటే అన్ని అర్హతలున్న తనకు ఛాన్స్‌ ఇవ్వాలని ఆయన కోరుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆవి ర్భావంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య రీతిన మహబూబాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన ప్రొఫెసర్‌ అజ్మీర సీతారాంనాయక్‌ పూర్వ ఆశ్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉద్యమ నాయకత్వంలో పనిచేశారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో నే మహబూబాబాద్‌ తొలి ఎంపీ సీటుకు ప్రొఫెసర్‌ అజ్మీర సీతారాంనాయక్‌ ఎంపికయ్యారు. స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యమ నాయకులను ప్రజా ప్రతినిధులుగా చేయాలన్న ఆలోచన క్రమంలోనే సీతా రాంనాయక్‌కు సీటు కేటాయించారు. యూనివర్శిటీ విద్యార్థులు, ఉద్యమకారులు ఆయనకు బాసటగా నిలవడంతో ఎంపీగా గెలుపొందా రు.


ఎంపీ సీటు మిస్సై రాజ్యసభకు...?

గత లోక్‌సభ ఎన్నికల సమయంలో మరోసారి మహబూబాబాద్‌ ఎంపీ సీటు వస్తుందని సీతారాం నాయక్‌ ఆశపడ్డారు. ఏ కారణం చేతనో కానీ మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితకు మహబూబాబాద్‌ సీటు కేటాయించడంతో సీతారాంనాయక్‌ మాజీ ఎంపీగానే మిగిలిపోయారు. అప్పటు నుంచి నిత్యం అధిష్ఠానాన్ని కలుస్తూ తనకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అయి రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 6న జారీ కానున్న నేపథ్యంలో 13 వరకు నామి నేషన్‌ల దాఖలు అవకాశం ఉంటుంది. ఆ క్రమంలోనే మరోమారు ఎస్టీ సామాజికవర్గం నుంచి మహబూ బాబాద్‌ మాజీ ఎంపీ, ప్రొఫెసర్‌ అజ్మీర సీతారాం నాయక్‌ పేరు తెరపైకి వస్తోంది. సామాజికవర్గాల వారీగా చూస్తే ఇప్పుడు టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుల్లో ఓసీ నుంచి ఇద్దరు, బీసీ నుంచి ముగ్గురు అధికారంలో ఉన్నారు. మరో బీసీ కూడ ఏపీ కోటా నుంచి రాజ్యసభ కు పదవీవిరమణ చేయనున్నారు. ఇక రేపటి రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికల విషయంలో ఎమ్మెల్యేల బలాన్ని పరిగణలోకి తీసుకుంటే టీఆర్‌ఎస్‌ ప్రకటించిన అభ్యర్థుల విజయం లాంఛనమవుతున్న క్రమంలో ఒక టి ఓసీకింద మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఖాయ మంటున్నారు. మరోస్థానంలో ఎస్టీలకు  అవకాశమిచ్చి ఉద్యమ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోటా నుంచి మహ బూబాబాద్‌ మాజీ ఎంపీ అజ్మీర సీతారాంనాయక్‌కు కేటాయిస్తారా..? అనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే కొద్దీకాలం కిందటే ఎమ్మెల్సీల్లో ఎస్టీ సామాజికవర్గం నుంచి మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన సత్యవతి రాథోడ్‌కు అవకాశం కల్పించి మంత్రి పదవీని కట్టబెట్టి న క్రమంలో అదే సామాజికవర్గం నుం చి సీతారాం నాయక్‌కు రాజ్యసభ సీటు ఇస్తారా...? అన్న ది కూడా సందేహాస్పదమే. ఏదైనా సీఎం కేసీఆర్‌ తలు చుకుంటే సాధ్యమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. 


రాష్ట్రస్థాయి నామినెటేడ్‌ రేసులో...

మహబూబాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నా యకుల్లో తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, నూకల నరేష్‌ రెడ్డి, బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి కూడ రాష్ట్రస్థాయి నా మినెటేడ్‌ పదవులను ఎప్పట్నుంచో ఆశిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా రెం డు టర్మ్‌లు పనిచేసిన తక్కెళ్లపల్లి రవీందర్‌రావు గత అసెంబ్లీ ఎన్ని కల సమయంలో పాలకుర్తి ఎమ్మెల్యే సీటు కోసం ప్ర యత్నాలు చేశారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు కొనసాగించా రు. అధిష్టానం అవ కాశం కల్పించలేదు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉమ్మడి నల్గొండ జిల్లా వివిధ ఎన్నికల ఇన్‌చార్జిగా పని చేశారు. నూకల నరేష్‌రెడ్డి కూడ సీనియర్‌ నేతగా ఎప్ప ట్నుంచో నామినెటేడ్‌ పదవుల కోసం వేచిచూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగు తున్న ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ ఎన్నికల కు ఇన్‌చార్జిగా పనిచేశారు. ఇక బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి పార్టీ జిల్లా నాయకుడిగా కొనసాగి అధినేత సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ముఖ్యనేత ల వద్ద గుర్తింపు పొందిన నేతగా పేరు గడించారు. గతంలో ఆయన సతీమణికి కేసముద్రం మార్కెట్‌ చైర్మ న్‌ పదవీ ఇచ్చారు. ఆమె పదవీకాలం పూర్తయిన క్ర మంలో మరెదైనా రాష్ట్ర నామినెటేడ్‌ పదవీ కోసం బీర వెల్లి భరత్‌కుమార్‌రెడ్డి వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యాక నామినెటేడ్‌ పదవుల భర్తీ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని పార్టీ నాయకత్వం విశ్లేషిస్తోంది. 

Updated Date - 2020-03-02T11:29:25+05:30 IST