అపూర్వ సమ్మేళనం

ABN , First Publish Date - 2020-03-02T11:23:42+05:30 IST

అపూర్వ సమ్మేళనం

అపూర్వ సమ్మేళనం

పాలకుర్తి, మార్చి 1 : ఒకే పాఠశాలలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఐదు దశాబాబ్దాల తరువాత మళ్లీ అదే పాఠశాలో కలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పా ఠశాల ఈ అపూర్వ ఘట్టానికి వేదికైంది. ఈ సమ్మేళనానికి ఆనాటి గురువులు రాధాకిషన్‌రావు, స్వామి, దామోదర్‌రెడ్డి, కొండా వెంకటయ్య, వాసుదేవులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో తొలుత 1969లో జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని పూర్వవిద్యార్థులందరూ గుర్తుచేసుకున్నారు. ఆ ఉద్యమంలో మరణించిన విద్యార్థులు, పాఠాలు బోధించిన ఉపాధ్యాయుల ను తలచుకొని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థులు రాపాక సుధాకర్‌, చిట్యాల రాంచంద్రం, పసునూరి సత్యనారాయణ, భిక్షపతి, వెంకటరావు, భారతమ్మ, సు జాత, వింధ్యావళి, రామసొక్కం, వెంకటేశ్వరరావు, నాగలక్ష్మి, ఉప్పలయ్య, చంద్రమౌళి మాట్లాడుతూ ఆనాడు గురువులంటే ఎంతో భయంతో చదివేవాళ్లమని అన్నారు. ఉపాధ్యాయులు కూడా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యాబోధన చేసేవారని గుర్తుచేశారు. క్రమశిక్షణకు మారుపేరు పాలకుర్తి ఉన్నత పాఠశాల అని తెలిపారు. అనంతరం ఈ బ్యాచ్‌కు గుర్తుగా ఆ పాఠశాలకు బీరువాను విరాళంగా ఎస్‌ఎంసీ చైర్మన్‌ జీడి సమ్మయ్యకు అందజేశారు.

Updated Date - 2020-03-02T11:23:42+05:30 IST