గోవర్ధనగిరిలో ఎలుగుబంటి హల్‌చల్
ABN , First Publish Date - 2020-03-02T11:22:24+05:30 IST
గోవర్ధనగిరిలో ఎలుగుబంటి హల్‌చల్

రఘునాథపల్లి, మార్చి 1: అడవులు, గుట్టల్లో ఉండాల్సిన ఎలుగుబంటి జనసంచారంలోకి వచ్చి హల్‌చల్ చేసిన సంఘటన జిల్లాలోని రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామం లో ఆదివారం జరిగింది. గోవర్దనగిరి వేణుగోపాల స్వామి గుట్ట నుంచి వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఉన్న రామాలయంలోకి ఎలుగుబంటి ప్రవేశించిందని తెలియడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. రామాలయం చుట్టూ గ్రామస్థులు గుమిగూడడంతో అయోమయానికి గురైన ఎలుగుబంటి రామాలయం నుంచి బయటకు వచ్చి వేణుగోపాల స్వామి గుట్ట వైపు పరుగెడింది. ఎలుగుబంటి గుట్ట వైపు వెళ్లిపోవడంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.