విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి

ABN , First Publish Date - 2020-03-02T11:20:44+05:30 IST

విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి

విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి

శాయంపేట, మార్చి1: ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్కత్తుకు ఉపాధ్యాయులు బంగారు బాటలు వేసి విద్యార్థులను తీర్చిదిద్దాలని జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి అన్నారు. శనివారం రాత్రి మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆమె హాస్టల్‌ నిద్ర చేశారు. ఆదివారం ఉదయం 5గంటలకు నిద్రలేచి విద్యార్థులకు యోగా చేయించారు. అనంతరం విద్యార్థులతో కలిసి రన్నింగ్‌, సైక్లింగ్‌, షటిల్‌, కోకో, కబడ్డీ ఆటలు ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వ గువిద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి


జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి

శాయంపేట, మార్చి1: ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్కత్తుకు ఉపాధ్యాయులు బంగారు బాటలు వేసి విద్యార్థులను తీర్చిదిద్దాలని జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి అన్నారు. శనివారం రాత్రి మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆమె హాస్టల్‌ నిద్ర చేశారు. ఆదివారం ఉదయం 5గంటలకు నిద్రలేచి విద్యార్థులకు యోగా చేయించారు. అనంతరం విద్యార్థులతో కలిసి రన్నింగ్‌, సైక్లింగ్‌, షటిల్‌, కోకో, కబడ్డీ ఆటలు ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వ గురుకులాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పని చేస్తున్నాయని ప్రభుత్వ గురుకులాల్లో కార్పొరేట్‌ స్థాయి విద్యను అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తాను ఈ గురుకులంలో రాత్రి విద్యార్థులతో కలిసి నిద్ర చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. గురుకులంలో విద్యార్థులకు సరైన గదులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, అదనపు తరగతి గధులు నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పని చేసి విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆమె కోరారు. జిల్లాలోని గురుకులాలను అన్నింటిని తాను సందర్శించి సమస్యలను తెలుసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కోడెం శ్రీనివాస్‌, ఎంపీపీ మెతకు తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ కందగట్ల రవి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కుసుమ శరత్‌బాబు, వైస్‌ చైర్మన్‌ దూదిపాల తిరుపతిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.రుకులాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పని చేస్తున్నాయని ప్రభుత్వ గురుకులాల్లో కార్పొరేట్‌ స్థాయి విద్యను అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తాను ఈ గురుకులంలో రాత్రి విద్యార్థులతో కలిసి నిద్ర చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. గురుకులంలో విద్యార్థులకు సరైన గదులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, అదనపు తరగతి గధులు నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పని చేసి విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆమె కోరారు. జిల్లాలోని గురుకులాలను అన్నింటిని తాను సందర్శించి సమస్యలను తెలుసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కోడెం శ్రీనివాస్‌, ఎంపీపీ మెతకు తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ కందగట్ల రవి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కుసుమ శరత్‌బాబు, వైస్‌ చైర్మన్‌ దూదిపాల తిరుపతిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T11:20:44+05:30 IST