నేటి నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

ABN , First Publish Date - 2020-07-28T08:32:05+05:30 IST

రాష్ట్రంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నిర్వహణకు మావోయిస్టులు సిద్ధమవుతున్నారు. మంగళవారం నుంచి ఆగస్టు 3వ తేదీ

నేటి నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

  • ఏజెన్సీలో నక్సల్స్‌ కదలికలు.. పోలీసుల కూంబింగ్‌

భూపాలపల్లి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నిర్వహణకు మావోయిస్టులు సిద్ధమవుతున్నారు. మంగళవారం నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ నిర్వహించనున్న వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఇప్పటికే పిలుపునిచ్చింది. చార్‌మజుందర్‌ వర్ధంతి సందర్భంగా ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను మావోయిస్టు పార్టీ నిర్వహిస్తోంది. తెలంగాణలో వారోత్సవాలను విజయవంతం చేయడం ద్వారా ఉనికి చాటుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. కొమరంభీం, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు. 

Updated Date - 2020-07-28T08:32:05+05:30 IST