పుడమి పై కాలుష్య ఒత్తిడి తగ్గించాలి

ABN , First Publish Date - 2020-07-05T20:04:38+05:30 IST

భూమిపై కాలుష్య ఒత్తిడిని తగ్గించేందుకు వ్యూహాత్మకంగా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని గుహావతి ఐఐటి కెమికల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ బీపీ మండల్‌ అభిప్రాయపడ్డారు

పుడమి పై కాలుష్య ఒత్తిడి తగ్గించాలి

హైదరాబాద్‌: భూమిపై కాలుష్య ఒత్తిడిని తగ్గించేందుకు వ్యూహాత్మకంగా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని గుహావతి ఐఐటి కెమికల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ బీపీ మండల్‌ అభిప్రాయపడ్డారు.‘ పుడమిపై గ్రీన్‌హౌసెస్‌ వాయువుల తగ్గింపు, పర్యావరణ ప్రభావం, సుస్ధితర వాతావరణం’ అన్నఅంశంపై జరిగిన వెబ్‌నార్‌లో గుహావతి నుంచి మండల్‌, మినిన్టర్‌ క్వార్టర్స్‌ నుంచి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ప్రొఫెసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమిపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు బొగ్గు వినియోగం కన్నా బ్యాటరీ ఆధారిత వాహనాలు, విద్యుత్‌ ఉపయోగాలపై దృష్టి సారించాలని ప్రొఫెసర్‌ మండల్‌ సూచించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఎవరికి వారు స్వచ్చందంగా బాధ్యత తీసుకోవాలని మండల్‌ అభిప్రాయపడ్డారు. విద్యుత్‌, బ్యాటరీల వినియోగం వల్ల పర్యావరణానికి ముప్పు తక్కువగా ఉండడమే కాకుండా భవిష్యత్‌ తరాలకు బంగారు బాట వేసినట్టవుతుందని అన్నారు.


రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ కాలుష్య భూతాన్ని తరిమికొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలో కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని వినోద్‌కుమార్‌ కోరారు. ప్రతి గ్రామంలో మొక్కలు నాటడం , సర్పంచ్‌లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిందని ఈ మేరకు పంచాయితీరాజ్‌ చట్టాన్ని సవరించిందని అన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసే సర్పంచ్‌లపై చర్యలు తీసుకునే చట్టం దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని వినోద్‌కుమార్‌వివరించరు.

Updated Date - 2020-07-05T20:04:38+05:30 IST