దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపేందుకు నేడు వెబినార్‌

ABN , First Publish Date - 2020-12-03T08:03:47+05:30 IST

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని(డిసెంబరు 3) పురస్కరించుకొని రాష్ట్ర దివ్యాంగ సంక్షేమ

దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపేందుకు నేడు వెబినార్‌

హైదరాబాద్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి):  అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని(డిసెంబరు 3) పురస్కరించుకొని రాష్ట్ర దివ్యాంగ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుఽధవారం వెబినార్‌ నిర్వహించనున్నారు. ‘కరోనా తర్వాత దివ్యాంగులు మెరుగైన పూర్వస్థితికి చేరుకోవడం’ అనే అంశంపై ఇది జరగనుంది. ముఖ్య అతిథిగా మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి దివ్య దేవరాజన్‌ పాల్గొంటారని దివ్యాంగ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ బి.శైలజ తెలిపారు.


అలాగే.. ఐఏఎస్‌ సాధించిన దివ్యాంగులు, వివిధ రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరిన దివ్యాంగులు, సినీ హాస్య నటుడు బ్రహ్మానందం తదితర సెలబ్రిటీలు తమ సందేశం ద్వారా దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపుతారని చెప్పారు. కాగా, దివ్యాంగులు తమకు సంబంధించిన పథకాలకు ఇకపై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నూతన విధానాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. 


Updated Date - 2020-12-03T08:03:47+05:30 IST