గ్రూప్‌-4కు మళ్లీ వెబ్‌ ఆప్షన్లు

ABN , First Publish Date - 2020-06-23T02:10:19+05:30 IST

తెలంగాణలో గ్రూప్‌-4 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మళ్లీ వెబ్‌ ఆప్షన్‌ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మంగళవారం నుంచి ఈ నెల 25 వరకు జిల్లాల వారీగా పోస్టులను ఎంపిక చేసుకోవాలని పేర్కొంది.

గ్రూప్‌-4కు మళ్లీ వెబ్‌ ఆప్షన్లు

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-4 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మళ్లీ వెబ్‌ ఆప్షన్‌ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మంగళవారం నుంచి ఈ నెల 25 వరకు జిల్లాల వారీగా పోస్టులను ఎంపిక చేసుకోవాలని పేర్కొంది. గతంలో ద్రువపత్రాల పరిశీలన పూర్తయి వెబ్‌ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులు.. మళ్లీ కొత్తగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. గతంలో నమోదు చేసిన వివరాలను రద్దు చేస్తున్నామని వివరించింది. అభ్యర్థులు తాజా వెబ్‌ఆప్షన్‌లో నమోదు చేసిన వివరాల ఆధారంగానే ఉద్యోగాల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. జిల్లాలవారీగా ఖాళీలను చూసుకుని జూనియర్‌ అసిస్టెంట్‌,  టైపిస్ట్‌, జూనియర్‌ స్టెనో, తదితర పోస్టుల ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. గ్రూప్‌-4 రాత పరీక్షలో మెరిట్‌ వస్తే సరిపోదని, ప్రావీణ్యత పరీక్షలో కచ్చితంగా అర్హత సాధించాలని తెలిపింది. ప్రావీణ్యత పరీక్షలో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకోమని.. కేవలం అర్హత సాధిస్తే సరిపోతుందని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. 

Updated Date - 2020-06-23T02:10:19+05:30 IST