నేతన్నకు నగదు లభ్యత

ABN , First Publish Date - 2020-05-24T07:37:15+05:30 IST

రాష్ట్రంలోని నేత కార్మికులకు ఊరట. కరోనా కష్టకాలంలో పని లేక , ఉత్పత్తుల విక్రయం లేక ఇబ్బందులు పడుతున్న..

నేతన్నకు నగదు లభ్యత

  • లాకిన్‌ గడువు ఎత్తివేతతో ఊరట
  • 26,500 మంది కార్మికులకు లబ్ధి
  • ఒక్కొక్కరికి కనిష్ఠంగా రూ.50 వేలు
  • కార్మికులకు 90 కోట్లు లభ్యం
  • అధికారులతో కేటీఆర్‌ సమీక్ష
  • నేతన్నకు నగదు లభ్యత
  • లాకిన్‌ గడువు ఎత్తివేతతో ఊరట
  • 26,500 మంది కార్మికులకు లబ్ధి: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నేత కార్మికులకు ఊరట. కరోనా కష్టకాలంలో పని లేక , ఉత్పత్తుల విక్రయం లేక ఇబ్బందులు పడుతున్న నేత కార్మికులకు నగదు అందుబాటులోకి రానుంది. ‘నేతన్నకు చేయూత’ పేరిట రెండేళ్లుగా అమలు చేస్తున్న పథకంలోని నిధులను వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు శనివారం టీఎ్‌సఐఐసీ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో చేనేత-జౌళి శాఖ మంత్రి కేటీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. 

నేతన్నకు చేయూత పథకంలో మూడేళ్ల  లాకిన్‌ గడువును ఎత్తివేయనున్నారు. దీంతో రాష్ట్రంలోని 26,500 నేత కార్మికులకు గాను ఒక్కొక్కరికి కనిష్ఠంగా రూ.50 వేల నుంచి గరిష్ఠంగా రూ.1.25 లక్షల వరకు నగదు అందుబాటులోకి రానుంది. సొసైటీల పరిధిలోని కార్మికులకు గతంలో ముగిసిన పొదుపు పథకానికి సంబంధించిన రూ.1.18 కోట్లను కూడా అందించాలని మంత్రి ఆదేశించారు. 


తద్వారా 2,337 మందికి ఈ నగదు చేరనుంది. బతుకమ్మ చీరల ఉత్పత్తిపైనా మంత్రి సమీక్షించారు. వరంగల్‌ కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కు, హైదరాబాద్‌ ఫార్మా సిటీ పనులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలపైనా చర్చించారు. టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, చేనేత, జౌళి శాఖ సంచాలకులు శైలజారామయ్యర్‌ పాల్గొన్నారు. నేతన్నలకు నగదును అందుబాటులోకి తేవడంపై మంత్రి కేటీఆర్‌కు.. ఆప్కో మాజీ చైర్మన్‌ మండల శ్రీరాములు కృతజ్ఞతలు తెలిపారు. 


మొత్తం సొమ్ము రూ. 93 కోట్లు

నేతన్నకు చేయూత పథకాన్ని ప్రభుత్వం రెండేళ్లుగా అమలు చేస్తోంది.  కార్మికులు తమ వేతనంలో కొంత భాగం (గరిష్ఠంగా 25ు) వరకు దాచుకోవచ్చు. దీనికి రెట్టింపు మొత్తాన్ని కార్మికుడి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ నిధులను కనీసం మూడేళ్లు తీసుకోవడానికి వీలు లేదు. ప్రస్తుతం ఈ నిబంధనను తొలగించడంతో కార్మికులు సొమ్మును   డ్రా చేసుకునే వీలు కలిగింది. ఈ మొత్తం రూ.93 కోట్లుగా ఉంది.  


Updated Date - 2020-05-24T07:37:15+05:30 IST