నిష్క్రమించనున్న నైరుతి రుతుపవనాలు
ABN , First Publish Date - 2020-10-24T11:52:02+05:30 IST
దేశంలో పుష్కలంగా వర్షాలు కురిపించిన నైరుతి రుతుపవనాలు మరో నాలుగు రోజుల్లో నిష్క్రమించనున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటింది. ఈ నేపథ్యంలో మధ్య, దక్షిణ భారత దేశంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో

హైదరాబాద్: దేశంలో పుష్కలంగా వర్షాలు కురిపించిన నైరుతి రుతుపవనాలు మరో నాలుగు రోజుల్లో నిష్క్రమించనున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటింది. ఈ నేపథ్యంలో మధ్య, దక్షిణ భారత దేశంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు గాలులు దిశ మారే వాతావరణం నెలకొంది. దీంతో వచ్చే 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిష్క్రమిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదే సమయంలో ఈనెల 28న దక్షిణాదిలో తమిళనాడు, ఏపీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొంది. జూన్ నుంచి ఇప్పటి వరకు బంగాళాఖాతంలో 12 అల్పపీడనాలు ఏర్పడ్డాయి.