మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు!

ABN , First Publish Date - 2020-10-03T11:36:10+05:30 IST

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటరు ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు!

హైదరాబాద్‌: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటరు ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ ఛత్తీ్‌సగఢ్‌, దాని పరిసర ప్రాంతాల్లో 7.6 కి.మీ ఎత్తు వద్ద మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Updated Date - 2020-10-03T11:36:10+05:30 IST