కరోనా బాధితులను ఆదుకుంటాం: ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-04-05T07:46:03+05:30 IST
రాష్ట్రంలో కరోనా బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శనివారం ఎన్‌ఆర్‌ఐలు...
తొర్రూరు, ఏప్రిల్ 4: రాష్ట్రంలో కరోనా బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శనివారం ఎన్‌ఆర్‌ఐలు అనుమాండ్ల రాజేందర్‌రెడ్డి, ఝాన్సీ సహకారంతో వలస కూలీలకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు విధిగా లాక్‌డౌన్‌ను పాటించాలని సూచించారు. తొర్రూరులో డ్రోన్‌తో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీని ప్రారంభించారు.