లారెన్స్ తమ్ముడి బాధితురాలికి రక్షణ కల్పిస్తాం
ABN , First Publish Date - 2020-03-08T09:25:33+05:30 IST
సినీ కొరియోగ్రాఫర్ లారెన్స్ తమ్ముడు ఎల్విన్, ఏసీపీ రవీందర్‌రెడ్డిల బాధితురాలికి రక్షణ కల్పిస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఈ

విచారణ జరిపిస్తాం: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల
వరంగల్ అర్బన్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): సినీ కొరియోగ్రాఫర్ లారెన్స్ తమ్ముడు ఎల్విన్, ఏసీపీ రవీందర్‌రెడ్డిల బాధితురాలికి రక్షణ కల్పిస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ‘‘బ్రోతల్ కేసులో ఇరికించారు’’ శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. బాధితురాలిని ఫోన్‌లో పలకరించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కాగా.. ఎల్విన్, రవీందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర నాయకురాలు నలిగంటి రత్నమాల డిమాండ్ చేశారు.