ప్రాణాలైనా ఇస్తాం.. ఫార్మా సిటీకి భూములివ్వం

ABN , First Publish Date - 2020-12-19T07:06:48+05:30 IST

ఫార్మా సిటీ నిర్మాణానికి తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని ‘‘ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట సమితి’’ సభ్యులు,

ప్రాణాలైనా ఇస్తాం.. ఫార్మా సిటీకి భూములివ్వం

ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, రైతులు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఫార్మా సిటీ నిర్మాణానికి తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని ‘‘ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట సమితి’’ సభ్యులు, రైతులు తేల్చి చెప్పారు. ప్రాణాలైనా ఇస్తామని, తమ భూములను మాత్రం ఫార్మా సిటీకి ఇవ్వబోమని స్పష్టం చేశారు. సమితి సభ్యులు, రైతులకు మద్దతుగా డాక్టర్‌ డి.నరసింహారెడ్డి, సామాజిక కార్యకర్త సరస్వతి


శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఫార్మా సిటీకి వ్యతిరేకంగా ఉన్నారని, పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో ఈ విషయం బహిర్గతమైందని వారు పేర్కొన్నారు. తప్పుడు నివేదికలతో ఫార్మా సిటీ ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించారన్నారు. ఫార్మా సిటీకి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, ప్రారంభానికి ప్రధాని రావద్దని కోరారు. భూ సేకరణపై ఇప్పటికే హైకోర్టులో 12 పిటిషన్లు దాఖలు చేశామని, కోర్టులో కేసులు నడుస్తున్నా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆన్‌లైన్‌లో రైతుల పేర్లు తొలగిస్తున్నారని ఆరోపించారు.


Updated Date - 2020-12-19T07:06:48+05:30 IST