6 నెలల్లో ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం

ABN , First Publish Date - 2020-12-30T07:36:35+05:30 IST

వచ్చే ఆరు మాసాల్లో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని, గత ఐదేళ్ల కాలంలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, కారుణ్య నియామకం, ఇంటర్నల్‌ నియామకాల ద్వారా 16వేలకు పైగా పోస్టులను నియమించుకున్నామని సింగరేణి సీఎండీ ఎన్‌.

6 నెలల్లో ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం

సింగరేణి సీఎండీ ఎన్‌. శ్రీధర్‌ 


కొత్తగూడెం, డిసెంబరు 29 : వచ్చే ఆరు మాసాల్లో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని, గత ఐదేళ్ల కాలంలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, కారుణ్య నియామకం, ఇంటర్నల్‌ నియామకాల ద్వారా 16వేలకు పైగా పోస్టులను నియమించుకున్నామని సింగరేణి సీఎండీ ఎన్‌. శ్రీధర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పోస్టుల్లో ఇంటర్నల్‌ కోటా పెంచి అర్హులందరికీ అవకాశం కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో మంగళవారం నిర్వహించిన 46వ రక్షణ త్రైపాక్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్షణ విషయంలో రాజీపడేది లేదని, కార్మికుల భద్రతకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని  స్పష్టం చేశారు. రక్షణ పరికరాల కొనుగోలు, రక్షణ చర్యల కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదని హామీఇచ్చారు. కొవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా 60వేల రాపిడ్‌ టెస్ట్‌ కిట్లతో పరీక్షలు జరిపామని, విస్తత చర్యలు చేపట్టిన ఫలితంగానే అత్యల్ప సంఖ్యలో సింగరేణీయులు కరోనా బారిన పడ్డారని తెలిపారు. 

Updated Date - 2020-12-30T07:36:35+05:30 IST