అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం
ABN , First Publish Date - 2020-07-04T11:32:34+05:30 IST
గ్రేటర్ పరిధిలో నాలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తామని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతి స్పష్టం
వరంగల్ సిటీ, జూలై 3 : గ్రేటర్ పరిధిలో నాలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తామని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. శుక్రవారం 27వ డివిజన్ మ్యూజికల్ గార్డెన్ వద్ద బొందివాగు నాలా స్థలంలో జరుగుతున్న నిర్మాణాన్ని కమిషనర్ పరిశీలించి కూల్చివేయించారు. కమిషనర్ మాట్లాడుతూ నాలాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడంలో రాజీ పడబోమన్నారు. అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చి వేస్తున్నామన్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారం చేయడం సరికాదని, వారి కోసం ప్రత్యేక హాకర్ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏసీపీ సాంబయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు.