సాగర్‌లో పోటీ చేస్తాం..మంద కృష్ణ

ABN , First Publish Date - 2020-12-30T07:30:26+05:30 IST

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో మహాజన సోషలిస్టు పార్టీతో కలిసి ఎంఆర్‌పీఎస్‌ పోటీచేస్తుందని దాని వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ చెప్పారు

సాగర్‌లో పోటీ చేస్తాం..మంద కృష్ణ

ఏన్కూరు, డిసెంబరు 29: నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో మహాజన సోషలిస్టు పార్టీతో కలిసి ఎంఆర్‌పీఎస్‌ పోటీచేస్తుందని దాని వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ చెప్పారు.  ఖమ్మం జిల్లా ఏన్కూరు అంబేడ్కర్‌, కొమ్రం భీం విగ్రహాలకు మంగళవారం ఆయన  పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్‌ కూడా ప్రజాసమస్యలపై పోరాటంలో విఫలమైందన్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ ఆరేళ్లు దాటినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. 

Updated Date - 2020-12-30T07:30:26+05:30 IST