ముంపు బాధితులను ఆదుకుంటాం

ABN , First Publish Date - 2020-08-22T10:15:26+05:30 IST

ముంపు ప్రాంతాల బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు వెల్లడించారు.

ముంపు బాధితులను ఆదుకుంటాం

మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు

 

వరంగల్‌ సిటీ, ఆగస్టు 21 : ముంపు ప్రాంతాల బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు వెల్లడించారు. శుక్రవారం 22, 8 డివిజన్లలోని పలు ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇళ్లు కూలి నష్టపోయిన బాధితులకు భరోసా ఇచ్చారు. డీకే నగర్‌లో బీసీ హాస్టల్‌ ప్రాంతంలో డ్రెయిన్‌ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.  శిథిలావస్థలో ఉన్న భవనాలతో పెను ముప్పు పొంచి ఉందన్నారు. ఈ నేపథ్యంలో తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యకోట ప్రాంతంలో ప్లాస్టిక్‌ గ్లాసులు బహిరంగ ప్రదేశంలో పడేసిన సదానందంకు రూ.5 వేల జరిమానా విధించాలని అధికారులను మేయర్‌ ప్రకాశ్‌రావు ఆదేశించారు.   

 

పునరావాస శిబిరం సందర్శన :

హన్మకొండలోని పునరావాస కేంద్రం పద్మశాలి కమ్యూనిటీ హాల్‌ను మేయర్‌ ప్రకాశ్‌రావు సందర్శించారు. తలదాచుకుంటున్న ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు. అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న ఇళ్ల విషయాన్ని సీఎం కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కేంద్రంలోని వారితో కలిసి మేయర్‌ భోజనం చేశారు. కేంద్రంలోని మహిళలకు చీరెలను పంపిణీ చేశారు.

Updated Date - 2020-08-22T10:15:26+05:30 IST