శానిటైజర్ల పంపిణీకి ప్రయత్నిస్తున్నాం: భట్టి

ABN , First Publish Date - 2020-03-27T09:53:51+05:30 IST

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఫార్మా కంపెనీలతో శానిటైజర్లను ఉత్పత్తి చేయించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయించే ప్రయత్నం కాంగ్రెస్‌

శానిటైజర్ల పంపిణీకి ప్రయత్నిస్తున్నాం: భట్టి

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఫార్మా కంపెనీలతో శానిటైజర్లను ఉత్పత్తి చేయించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయించే ప్రయత్నం కాంగ్రెస్‌ పార్టీ పక్షాన చేస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌కు అప్పగించామని ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో శానిటైజర్లు దొరకడం లేదని, ముఖ్యంగా గ్రామీణ ప్రజానీకానికి ఇవి అందుబాటులో లేవని అన్నారు.

Updated Date - 2020-03-27T09:53:51+05:30 IST