కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం: ఈటల

ABN , First Publish Date - 2020-04-01T21:48:55+05:30 IST

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అంతర్జాతీయ విమానాలు రద్దు చేయాలని మొదట సీఎం కేసీఆరే కోరారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం: ఈటల

హైదరాబాద్: కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అంతర్జాతీయ విమానాలు రద్దు చేయాలని మొదట సీఎం కేసీఆరే కోరారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే లాక్‌డౌన్‌ ప్రకటించామని చెప్పారు. మర్కజ్‌ గురించి కేంద్రానికి సమాచారం ఇచ్చింది తెలంగాణేనని, కరోనాపై కేంద్రం ఇంకా యాక్టివ్‌గా పనిచేయాలని సూచించారు. తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ జరగలేదని, గాంధీలో చికిత్స పొందుతున్న 10మందికి నెగెటివ్‌ వచ్చిందని, వారిని డిశ్చార్జ్‌ చేస్తామని తెలిపారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో ఆరుగురు చనిపోయారని ఈటల రాజేందర్ తెలిపారు.

Updated Date - 2020-04-01T21:48:55+05:30 IST