ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయసమీక్ష చేయడానికి వీల్లేదు

ABN , First Publish Date - 2020-03-04T09:22:09+05:30 IST

రాజ్యాంగ వ్య తిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే తప్ప ప్రభుత్వ విధా న నిర్ణయాలపై న్యాయసమీక్ష చేయడానికి వీల్లేదని అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) బి.ఎ్‌స.ప్రసాద్‌ హైకోర్టు డివిజ న్‌ బెంచ్‌కు నివేదించారు. నూతన

ప్రభుత్వ విధాన నిర్ణయాలపై  న్యాయసమీక్ష చేయడానికి వీల్లేదు

రాజ్యాంగ వ్యతిరేకమైతే తప్ప అవకాశం లేదు...

వ్యాజ్యాలన్నీ రాజకీయ ప్రత్యర్థులు వేసినవే

సచివాలయ భవనాలను అడ్డుకునేందుకే

హైకోర్టు ధర్మాసనానికి నివేదించిన ఏజీ

హైదరాబాద్‌, మార్చి 3(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ వ్య తిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే తప్ప ప్రభుత్వ విధా న నిర్ణయాలపై న్యాయసమీక్ష చేయడానికి వీల్లేదని అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) బి.ఎ్‌స.ప్రసాద్‌ హైకోర్టు డివిజ న్‌ బెంచ్‌కు నివేదించారు. నూతన సచివాలయ భవన నిర్మాణంపై వ్యాజ్యాలు వేసిన వారిలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ ఉన్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులే ప్రభుత్వ విధాన నిర్ణయాలను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చవుతుందని, ప్రస్తుత భవనాలు మరో 50-70 ఏళ్లు మనుగడ సాగిస్తాయని, ప్రజానిధికి ప్రభుత్వం కస్టోడియన్‌ గా ఉండాలని, ప్రజాసంక్షేమం కోసమే ఖర్చు చేయాలంటూ పిటిషన్‌దారులు కోరారని, దాదాపు అన్ని వ్యా జ్యాల్లోనూ ఇవే అంశాలున్నాయని గుర్తుచేశారు.


అయి తే, తెలంగాణ ప్రతిష్ఠ ఇనుమడించేలా సకల సౌకర్యాలతో సమీకృత సచివాలయ భవనసముదాయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అన్ని ఆలోచన లు చేశాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేబినెట్‌ సబ్‌కమిటీ నలుగురు ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌లతో వేసిన సాంకేతికకమిటీ పరిశీలించి సిఫారసులు చేసిందన్నారు. దీనిపై మంత్రిమండలి సమావేశంలో నిర్ణ యం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయంటూ.. పలు తీర్పులను ఉటంకించారు.


పిటిషనర్ల వాదనలు సత్యదూరం..

సచివాలయంలోని ‘ఏ-బ్లాకు’ను 21 ఏళ్ల క్రితం 1998లో నిర్మించారని హైకోర్టుకు ఏజీ తెలిపారు. బి, సీ-బ్లాకులను 41 ఏళ్ల క్రితం, డి-బ్లాకును 16 ఏళ్ల  క్రితం నిర్మించినట్లు పేర్కొన్నారు. ఇక జి-బ్లాకును 131 ఏళ్ల క్రితం 1888లో నిర్మించారని, అది  నిరుపయోగంగా ఉండటంతో శిథిలావస్థకు చేరుకుందని వివరించారు. ఇతర బ్లాకుల నిర్మాణం గురించి కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ భవనాలను మరో 70 ఏళ్లపాటు వినియోగించవచ్చంటూ పిటిషనర్లు చేస్తున్న వాదనలు సత్యదూరమని పేర్కొన్నారు. ఇక ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాలను 2019 జూన్‌ 20న అప్పగించారని, దీర్ఘకాలం నిరుపయోగంగా ఉండటంతో వాటిని పునర్‌ వినియోగంలోకి తేవడానికి భారీ మరమ్మతులు చేయాల్సి ఉందని అన్నారు. ఆయా బ్లాకులకు అత్యవసర ద్వారాలు, ఫైర్‌ సేఫ్టీ లేవన్నారు.


సీఎంవో కార్యాలయం ఉన్న సీ-బ్లాకులోనూ ఈ సౌకర్యాలు లేవని తెలిపారు. ప్లంబింగ్‌, ఎలక్ర్టికల్‌ వైరింగ్‌ 25 ఏళ్లకే కాలాతీతం అవుతాయని, పైపులైన్ల లీకేజీలు జరగడం వల్ల గత నాలుగేళ్లలో మూడుసార్లు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయని వివరించారు. బ్లాకుల వారీగా లోపాలను ఎత్తిచూపుతూ 30 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సచివాలయాన్ని వేర్వేరు ప్రభుత్వ భవనాల్లోకి తరలించినట్లు తెలిపారు. ఈ కారణాలను పరిగణనలోకి తీసుకుని సచివాలయ భవనాలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను కొట్టివేయాలని కోరారు. 


పటిష్ఠతపై పరీక్షకు ఆదేశించండి

సచివాలయ భవనాల పటిష్ఠతను స్వతంత్ర సంస్థకు చెందిన ఇంజనీర్లతో లేదా హైదరాబాద్‌ ఐఐటీ నిపుణులతో పరీక్షించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి కోరారు. కల్పించుకున్న ధర్మాసనం.. నలుగు ఇంజనీర్‌-ఇన్‌-చీ్‌ఫలతో కూడిన సాంకేతిక కమిటీ నివేదిక సరైనది కానప్పుడు మరో బృందం నివేదికను ఎలా విశ్వసించగలమని ప్రశ్నించింది. దీనికి సత్యంరెడ్డి బదులిస్తూ.. ప్రభుత్వ ఇంజనీర్లు ప్రభుత్వానికి అనుకూల నివేదికలిస్తారని, స్వతంత్ర సంస్థకు చెందిన ఇంజనీర్లతో భవనాల పటిష్ఠతను పరీక్షించాలని కోరారు. తదుపరి విచారణలో వాదనలు వింటామంటూ ఈ నెల 5కు వాయిదా వేసింది. 

Updated Date - 2020-03-04T09:22:09+05:30 IST