కౌలుదారీ వ్యవస్థకు మేం వ్యతిరేకం

ABN , First Publish Date - 2020-09-12T07:31:49+05:30 IST

కౌలుదారీ వ్యవస్థకు తాము వ్యతిరేకమని, ఇదే విషయాన్ని ఎన్నికల సందర్భంగానూ చెప్పామని కేసీఆర్‌ అన్నారు. రైతుకు,

కౌలుదారీ వ్యవస్థకు మేం వ్యతిరేకం

కౌలుదారీ వ్యవస్థకు తాము వ్యతిరేకమని, ఇదే విషయాన్ని ఎన్నికల సందర్భంగానూ చెప్పామని కేసీఆర్‌ అన్నారు. రైతుకు, కౌలుదారుకు మధ్య ప్రభుత్వ జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు. భూమి రికార్డుల్లో అనుభవదారుల కాలమ్‌ అనవసరమని కేసీఆర్‌ తేల్చిచెప్పారు.


గతంలో జాగీర్దార్లు, జమీందార్లు, భూస్వాముల వద్ద 90 శాతం భూమి ఉండేదని, ఇప్పుడు 93 శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని, 25 ఎకరాలు పైబడినవారు 0.28 శాతమేనని తెలిపారు.  గతంలో వీఆర్‌వోలు పేర్లు మారుస్తుంటే రైతులు ఇబ్బందులు పడేవారని, భూమిని రక్షించుకునేందకు కాళ్లరిగేలా తిరిగేవారని అన్నారు. ఆ వ్యవస్థ రద్దు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. 

Updated Date - 2020-09-12T07:31:49+05:30 IST